YSR Arogya Asara Scheme Details (వైఎస్సార్ ఆసరా) for Arogyasri Patients
Andhra Pradesh CM Y.S. Jagan Mohan Reddy launched a New scheme today YSR Arogya Asara (వైయస్సార్ ఆరోగ్య ఆసరా) to provide "Post–operative sustenance allowance" to the patients who undergo surgeries under Aarogyasri during post-operative recovery period @ Rs.225/- per day for the period of recovery prescribed subject to a maximum of Rs.5000/- per month with effect from 1st December, 2019.
Government hereby clarify that the “Post-operative recovery period” for which “Post–operative sustenance allowance” is entitled as ordered in the G.O. read above includes the period of recovery as prescribed by the experts, beyond discharge from the hospital, as consultation, pathological investigations, diagnosis, treatment/ surgery, medicines, food & accommodation during their stay in hospitals and free transportation of patients to their residence, have already been covered under Dr.YSR Aarogyasri.
ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే మరో కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ను గుంటూరు జనరల్ ఆస్పత్రిలో సోమవారం సీఎం ప్రారంభించనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలను ఈ పథకంలో అందచేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం భారతదేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల ఏటా 4.5 లక్షల మంది లబ్ధి పొందుతారు.
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగే కార్యక్రమంలో ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులు అందుకుంటారు. డిసెంబర్ 1 నుంచే పథకం అమల్లోకి వచ్చినా సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ చేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తించేలా ప్రభుత్వం రెండ్రోజుల క్రితమే మార్గదర్శకాలు జారీచేసింది. రోగి డిశ్చార్జి సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంకు ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమచేస్తారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
YSR Arogya Asara Details (వైఎస్సార్ ఆసరా వివరాలు)
- మొత్తం స్పెషాలిటీ విభాగాలు 26
- ఎన్నిరకాల శస్త్ర చికిత్సలు 836
- రోజుకు ఇచ్చే మొత్తం రూ.225
- నెల రోజుల విశ్రాంతికి రూ.5000
- లబ్ధిదారుల సంఖ్య 4.50 లక్షలు
- ఏటా వ్యయం దాదాపు రూ.300 కోట్లు
How to get YSR Arogya Asara Amount online:
The eligible patients must submit the details of their Bank Account i.e. Bank Account No, Branch Name, Branch Address & IFSC code and Aadhaar number to the Network Hospitals / Aarogya Mitras before or on the day of the discharge. In case if there is no personal Bank Account number such patient can give the Bank Account number of any other family member as shown in the Health cards.
Post-operative sustenance allowance shall be directly credited to the Bank Account of the eligible patients within 48 hours from the time of discharge from the Network Hospitals. In case of failures of banking transactions cheque shall be issued within 72 hours to such patients, from the time of transaction failure. Those cheques shall be distributed with the help of volunteers attached to the respective Village Secretariat/ Ward Secretariat.
YSR Arogya Asara Amount Calculation Method:
Ex.1 : In a month(30 days), sustenance allowance is calculated on day basis from day 1 to 22 days (22 x Rs.225 = Rs.4950/-) and thereafter from 23 days to 30 days rest period, maximum allowance is be fixed at Rs.5000/-.
Ex.2 : If rest period is 40 days, for first 30 days (1 month), Rs.5,000/- will be taken and for the remaining 10 days it will be calculated on day basis. The total would be Rs.5,000/- (for first 30 days) + Rs.225 x 10 days = Rs.7,250/-.